నిజామాబాద్: తెలంగాణలో మహాకూటమి ఒక దుష్టచతుష్టయమని ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణపై ప్రేమలేని పార్టీలు కూటమిగా వస్తున్నాయని మండిపడ్డారు. మహాకూటమిని ప్రజలు తిప్పికొట్టడం ఖాయమని ఎంపీ స్పష్టం చేశారు. ఓట్ల వ్యవహారం ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వస్తుందన్నారు. టీడీపీ-కాంగ్రెస్‌ పొత్తు అనైతికమని, ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను పీడించాయని ఎంపీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  

వై.ఎస్. జగన్ ప్రజా సంకల్పయాత్ర జోరుగా జరుగుతోంది. విశాఖ జిల్లాలో యాత్రలో భాగంగా విశాఖపట్నం శివారులో యాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. విశాఖపట్నంలో గడచిన రెండు రోజులుగా వర్షం బీభత్సం స్రష్టిస్తోంది. కుంభవ్రష్టిని తలపిస్తుంది.  విశాఖపట్నంలో భారీ స్థాయిలో కురిసిన వర్షానికి విశాఖ వాసులు అతలాకుతలం అయ్యారు. ఏకధాటిగా మూడు గంటల పాటు వర్షం బీభత్సం రేపింది. ఇంతటి వానలోనూ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి…

బీజేపీ పెద్దాయనగా సుపరిచితుడు అద్వానీ రాజకీయ జీవితం ముగిసిపోవటం లేదు. 75ప్లస్ లో ఉన్న ఆయన వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి పోటీ చేయనున్నట్లుగా చెబుతున్నారు. బీజేపీలో ఉన్న రూల్స్ ను మార్చటమే అద్వానీ మరోసారి బరిలోకి దిగటానికి కారణం. తాను గాంధీనగర్ నుంచి మరోసారి బరిలోకి దిగనున్నట్లుగా అద్వానీ తనతో స్వయంగా చెప్పినట్లుగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హా వాఘేలా వ్యాఖ్యానించారు. మొన్నటి వరకూ బీజేపీలో ఉన్న నిబంధన ప్రకారం 75…

Getty Images అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు ఆ దేశ అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ ఘాటుగా సమాధానమిచ్చారు. తన నేతృత్వంలోని న్యాయ శాఖ రాజకీయ ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని ఆయన కుండ బద్దలుకొట్టారు. అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ న్యాయశాఖపై పట్టు సాధించలేకపోతున్నారని ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయనిలా తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. 2016 ఎన్నికల్లో రష్యా జోక్యానికి సంబంధించిన కేసుల విచారణ విషయంలో ట్రంప్ న్యాయశాఖపై తీవ్ర…

తెలంగాణ ముఖ్యమంత్రి – టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికలకు వేగంగా సన్నద్ధమవుతున్నారా?  ముందస్తు ఎత్తుగడలో ఉన్న కేసీఆర్ మరో రెండు రోజుల్లో ఇందులో భాగంగా కీలక ప్రకటనలు చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముచ్చటగా మూడు పథకాలను ప్రారంభిస్తున్నారు. పేద ప్రజలందరికి కంటిచూపు సమస్యలు లేకుండా చూసే కంటి వెలుగు – రైతుకు దన్నుగా ఉండే బీమా – స్వయం ఉపాధి పొందాలని…

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంథీ తెలంగాణ పర్యటన కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అవకాశాలున్నాయా.. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఇక్కడి కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించేందుకు సర్వ శక్తులు పణంగా పెడుతున్నారు. ఇందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంథీని తెలంగాణకు రప్పించి పలు చోట్ల సభలు – సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఎంతో కాలం లేనందున నెలకు ఒకసారైనా రాహుల్ ను…

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు – ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్ మోహాన రెడ్డి పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో సంచలనం స్రుష్టిస్తోంది. కాపు కులస్థులు ఎక్కువగా ఉన్న జిల్లాలో వారికి రిజర్వేషన్లపై జగన్ చేసిన ప్రకటనతో తెలుగుదేశం నాయకులు చంకలు గుద్దుకున్నారు. ఇక జగన్ పని అయిపోయిందని సంబరపడ్డారు. జగన్ కాపులకు దూరమైనట్లేనని కేరంతలు కొట్టారు. అయితే పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. రిజర్వేషన్లపై ప్రకటన అనంతరం తూర్పు గోదావరి జిల్లాలో…

బీజేపీతో తెలంగాణ సీఎం కేసీఆర్ దోస్తీ మరోమారు స్పష్టమైంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి నేపథ్యంలో బీజేపీకి మరోమారు కేసీఆర్ దగ్గర కానున్నారని అంచనాలు వెలువడుతున్నాయి. డిప్యూటీ చైర్మన్ పోస్ట్ ను దక్కించుకోవడానికి అధికార – ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. బీజేపీ – కాంగ్రెస్ వర్గాలు తమ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఏ అభ్యర్థి గెలవాలన్నా.. బీజేడీ – టీఆర్ ఎస్ పార్టీ కీలకంగా మారటంతో.. మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.…

ఎన్నోసార్లు ఆరోగ్య సమస్యలు.. ప్రతిసారీ వదంతులు ఈసారి శాశ్వతంగా దూరం చెన్నై: కరుణానిధి ఆస్పత్రికి వెళ్లిన ప్రతిసారి ఆయన గురించి వదంతులు వ్యాపిస్తూనే ఉండేవి. ఇది నిన్నా మొన్నటి నుంచి కాదు. సుమారు 15ఏళ్ల క్రితం నుంచే అలాంటి వార్తలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఇలాంటి వార్తలు వినిపించిన ప్రతిసారీ డీఎంకే కార్యకర్తలు అల్లర్లకు పాల్పడటం, వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయడం వంటి పరిణామాలు కూడా జరిగాయి. 2012 డిసెంబరు 5న రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వదంతులు వ్యాపించాయి. అప్పట్లో…

రాజకీయ వ్యూహాలు – వాటిని పటిష్టగా అమలు చేయడంలో దిట్టగా పేరొందిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వ్యూహాలు ఎవరికి అర్ధం కావు. ఈ రోజు మంచి అనిపించింది… రేపు కాదు… అలాగే నిన్న చెడ్డ అనిపించింది నేడు మంచిగా మారుతుంది. రాజకీయాల్లో ఇది సహజం. అయితే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఒకింత ఆశ్యర్యంగానే ఉంటోంది. గడచిన కొన్ని దశాబ్దాలుగా బద్ద వైరులైన భారతీయ జనతా పార్టీ…