తెలంగాణ ముఖ్యమంత్రి – టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికలకు వేగంగా సన్నద్ధమవుతున్నారా?  ముందస్తు ఎత్తుగడలో ఉన్న కేసీఆర్ మరో రెండు రోజుల్లో ఇందులో భాగంగా కీలక ప్రకటనలు చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముచ్చటగా మూడు పథకాలను ప్రారంభిస్తున్నారు. పేద ప్రజలందరికి కంటిచూపు సమస్యలు లేకుండా చూసే కంటి వెలుగు – రైతుకు దన్నుగా ఉండే బీమా – స్వయం ఉపాధి పొందాలని…

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంథీ తెలంగాణ పర్యటన కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అవకాశాలున్నాయా.. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఇక్కడి కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించేందుకు సర్వ శక్తులు పణంగా పెడుతున్నారు. ఇందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంథీని తెలంగాణకు రప్పించి పలు చోట్ల సభలు – సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఎంతో కాలం లేనందున నెలకు ఒకసారైనా రాహుల్ ను…

న్యూదిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఊరట లభించింది. సెప్టెంబర్‌ 28 వరకూ ఆయన్ను అరెస్ట్ చేయకుండా దిల్లీ హైకోర్టు మరోసారి తాత్కాలిక ఉపశమనం కలిగించింది. ముందస్తు బెయిలు కోసం ఆయన చేసిన అభ్యర్థన పరిశీలించిన అనంతరం కోర్టు ఈ వెసులుబాటు కలిపించింది. ఈ అభ్యర్థనను పరిశీలించిన న్యాయమూర్తి ఏకే పాఠక్ దీనిపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఈడీని ఆదేశించారు. ఇప్పటికే తాము సమాధానం ఇచ్చామని విచారణ సమయంలో సీబీఐ…

గూగుల్‌లో తనను రెండు సార్లు తిరస్కరించారని ఆ తర్వాతే ఫ్లిప్ కార్ట్ పెట్టాలన్న ఆలోచన వచ్చిందని ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సాల్ చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ఎలా స్థాపించారో చెబుతూ ఓకార్యక్రమం ఇష్టాగోష్టిలో బిన్నీ బన్సాల్ పాల్గొన్నారు. ఐఐటీ ఢిల్లీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాకా… బిన్నీ విజన్ టెక్నాలజీపై పరిశోధన చేస్తున్న సార్నాఫ్ కార్ప్ అనే కంపెనీలో పని చేశారు. ఈ కంపెనీలో పనిచేస్తున్న సమయంలోనే అంటే 2005,2006లో తను గూగుల్‌కు అప్లై చేసుకున్నట్లు తెలిపిన బిన్నీ……

గుంటూరు: హైదరాబాద్‌లో నివసించే గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజల సౌకర్యార్థం సికింద్రాబాద్-విజయవాడ-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, తిరుపతి-సికింద్రాబాద్ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లని లింగంపల్లి లింగంపల్లి రైల్వే స్టేషన్ వరకూ పొడిగించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. గత నెలలో డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో చేసిన ప్రతిపాద పరిశీలించిన రైల్వేబోర్డు ఇందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఏ తేదీ నుంచి రెండు రైళ్లను పొడిగిస్తారో ఆ నిర్ణయాన్ని దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులే తీసుకోవాల్సిందిగా స్పష్టం…

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటిఛైర్మన్‌గా ఎన్‌డిఎ అభ్యర్ధి హరివంశ్‌నారాయణ్‌సింగ్‌ ఎన్నికయ్యారు. యుపిఎ ప్రతిపక్షాలు పోటీకి దించిన బికె హరిప్రసాద్‌కు 105 ఓట్లు రాగా అధికారపక్ష ఎన్‌డిఎ అభ్యర్ధి హరివంశ్‌నారాయణ్‌సింగ్‌కు 125 ఓట్లు లభించాయి. రాజ్యసభ అధికారపక్ష నాయకుడుఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ, ప్రతిపక్ష నేత గులామ్‌నబీ ఆజాద్‌లు కొత్తగా ఎన్నికైన డిప్యూటి ఛైర్మన్‌ను సత్కరించారు. అంతేకాకుండా హరివంశ్‌ను ఆయన స్థానం వద్దవరకూ తోడ్కొని వెళ్లారు. ప్రతిపక్ష నేత స్థానం పక్కనే ఆయనస్థానం ఉంటుంది. ఎన్నిక తర్వాత ప్రధాని నరేంద్రమోడీ సభనుద్దేశించి…

విశాఖపట్నం రైల్వేజోన్ ఆశలపైన కూడా కేంద్రప్రభుత్వ నీళ్ళు చల్లేసింది. దేశంలో కొత్త రైల్వేజోన్, డివిజన్ల ఏర్పాటు అంశమేదీ కేంద్రం పరిశీలనలో లేదని రైల్వేశాఖ సహాయమంత్రి రాజన్ గోహెన్ చేసిన ప్రకటనతో ఏపి విభజన హామీలకు కేంద్రం పూర్తిగా గండి కొట్టినట్లైంది. అడ్డుగోలు విభజన చేసి కాంగ్రెస్ ప్రజలను దెబ్బ కొడితే విభజన చట్టం అమలులో బిజెపి మోసం చేసిందన్నది అర్ధమైపోయింది. లోక్ సభలో కేంద్రం చేసిన తాజా ప్రకటనతో ఏపి అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోడి ఏదో పగపట్టినట్లుగా…

హైదరాబాద్‌: అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసిసి) అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటనపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 13, 14 తేదీలలో ప్రజాహిత బస్సుయాత్రతో పాటు రంగారెడ్డి జిల్లాలో బహిరంగ సభ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో సమావేశం, మేధావులు, తటస్తులతో భేటీ వంటి కార్యక్రమాలలో రాహుల్‌ పాల్గొనాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ దాదాపుగా ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాహుల్‌…

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు – ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్ మోహాన రెడ్డి పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో సంచలనం స్రుష్టిస్తోంది. కాపు కులస్థులు ఎక్కువగా ఉన్న జిల్లాలో వారికి రిజర్వేషన్లపై జగన్ చేసిన ప్రకటనతో తెలుగుదేశం నాయకులు చంకలు గుద్దుకున్నారు. ఇక జగన్ పని అయిపోయిందని సంబరపడ్డారు. జగన్ కాపులకు దూరమైనట్లేనని కేరంతలు కొట్టారు. అయితే పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. రిజర్వేషన్లపై ప్రకటన అనంతరం తూర్పు గోదావరి జిల్లాలో…