న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజపేయి ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి మాదిరిగానే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు గురువారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆయనకు ప్రాణాధార వ్యవస్థపై చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియగానే ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రాత్రి ఎయిమ్స్‌కు వెళ్లి ఆయన్ని పరామర్శించారు. రాత్రి పొద్దుపోయాక రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి కూడా ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

మంత్రులు, ప్రధాని ఒకరి తర్వాత ఒకరుగా ఆసుపత్రికి వస్తుండడంతో బీజేపీ శ్రేణులు, వాజపేయి అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది. గురువారం రాత్రి 7.15 గంటలకు ఆసుపత్రి వద్దకు చేరుకున్న ప్రధాని దాదాపు 50 నిమిషాలు అక్కడే ఉన్నారు.

Leave a Reply