తెలుగు ఇండస్ట్రీలో దాదాపు పది సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తో రీ ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో శంకర్ దాదా జిందాబాద్ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. యూపీఏ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో వివివినాయకర్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు.అప్పటి వరకు మెగాస్టార్ స్టామినాపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ డ్యాన్స్, ఫైట్స్ లో తనకు ఎదురు లేదని నిరూపించాడు. అంతే కాదు రైతులకు సంబంధించిన మంచి మెసేజ్ ఈ చిత్రంలో ఉంది. ప్రస్తుతం చిరంజీవి అలనాటి స్వాతంత్ర సమరయోధులు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి ‘ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ,తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి ,నయనతార ,కిచ్చ సుదీఫ్,తమన్నా ఇలా పెద్ద స్టార్స్ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఈ చిత్రం నుండి ఇప్పటికి ఒక మోషన్ పోస్టర్ తప్ప ఇంకేం రిలీస్ చేయలేదు.అయినఈ సినిమా పై ఇప్పటికే అనేక అంచనాలు పెరిపోతున్నాయి. ఈ చిత్రానికి సంభందించి టీజర్ ని మెగాస్టార్ పుట్టిన రోజున అంటే ఆగష్టు 22 ఉదయం 11 :30 రిలీస్ చేస్తున్నారు అని సమాచారం . కానీ అయితే అభిమానులు ఊహించిన విధంగా మెగాస్టార్ పుట్టిన రోజున కాకుండా ఒక రోజు ముందే ఆగష్టు 21 మంగళవారం ఉదయం 11.30 ఈ చిత్రం టీజర్ ని రిలీస్ చేస్తున్నట్లు ఈ చిత్ర బృద్దాం ప్రకటించింది.

ఈ చిత్రంలో అనేక యుద్ధ సన్నివేశాలు ప్రాధాన్యత ఉన్న చిత్రం . అందుకే ఈ చిత్రానికి ఆధునిక సాంకేతికతను జోడించి తెస్తున్నారు.ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తున్నారు. మొత్తానికి మెగా ఫ్యాన్స్ కి ఒక్కరోజు ముందే శుభవార్త అందిస్తున్నారు చిత్ర యూనిట్.

Leave a Reply